బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jul 05, 2020 , 00:58:08

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ధ్యేయం

తూప్రాన్‌ రూరల్‌: వ్యవసాయాభివృద్ధి కోసమే సహకార సంఘాల సంస్థలు పనిచేస్తున్నాయని తూప్రాన్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి అన్నారు . అంతర్జాతీయ సహకార సంఘ వారోత్సవాలు పురస్కరించుకొని పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ దీపక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, డైరెక్టర్‌ రాజేందర్‌రెడ్డితో కలిసి శనివారం స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయంలో జెం డాను ఎగురవేశారు. సిబ్బంది దేవేందర్‌చారి, దినేశ్‌, డైరెక్టర్లు పాల్గొన్నారు.

రామాయంపేటలో  ...

రామాయంపేట: రామాయంపేట, కోనాపూర్‌ ప్రాథమిక సహకార పరపతి సంఘాల్లో ఘనంగా అంతర్జాతీయ దినోత్సవాలు జరిగాయి. శనివారం పట్టణంలోని పీఏసీఎస్‌ చైర్మన్‌ బాదె చంద్రం, కోనాపూర్‌ సహకార సొసైటీలో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, వైస్‌ చైర్మన్‌ కరికె విజయలక్ష్మి విద్యాసాగర్‌లు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సహకార సంస్థలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కోనాపూర్‌ సర్పంచ్‌ చంద్రకళ, సీఈవోలు గోపాల్‌రెడ్డి, పుట్టి నర్సింహులు, మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ సంజీవరెడ్డి, కడారి బీరయ్య, డైరెక్టర్లు మామిడి సిద్ధిరాములు, గుడిసెల ప్రవీణ్‌, రాంచంద్రారెడ్డి, సురేశ్‌, మహిపాల్‌రెడ్డి, హరి కిషన్‌, రామిరెడ్డి ఉన్నారు.

 రైతుల అభివృద్ధికి చేయుత 

నిజాంపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా రైతులకు అతి తక్కువ వడ్డీలకు రుణాలిచ్చి వారి అభివృద్ధికి చేయూతనిస్తామని కల్వకుంట పీఏసీఎస్‌ చైర్మన్‌ అందె కొండల్‌రెడ్డి అన్నారు .శనివారం ఆయన స్థానిక పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట జెండాను ఆవిష్కరించారు.  పీఏసీఎస్‌ వైస్‌ చైర్మ న్‌ రాజేశం, డైరెక్టర్లు, టీఆర్‌ఎస్‌ నాయకలు ఉన్నారు.

సహకార సంఘాల అభివృద్ధికి కృషి...

చేగుంట: సహకార సంఘాల అభివృద్ధికి తన వంతు చేయూతనందిస్తానని డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ సండ్రుగు స్వామి పేర్కొన్నారు.చేగుంట సహకారం సంఘం వద్ద శనివారం జెండాను ఆవిష్కరించి   మొ క్కలు నాటారు. డైరెక్టర్లు  నర్సమ్మ,సత్యనారాయణ, రఘురాములు,బలరాములు తదితరులున్నారు.


logo