బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 05, 2020 , 00:58:07

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  •  దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి
  • రైతు వేదిక భవన నిర్మాణాలకు శంకుస్థాపన

చేగుంట: దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. మండల కేంద్రంతోపాటు పులిమామిడి, ఇబ్రహీంపూర్‌, మక్కరాజిపేట, చందాయిపేట గ్రామాల్లో రైతు వేదిక భవన నిర్మాణాలకు శనివారం ఎమ్మె ల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతుల సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేయడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.  మండలకేంద్రాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో రైతు వేదికల ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మాసుల శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌, చేగుంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీన్‌కుమార్‌, రైతు సంఘం జిల్లా డెరెక్టర్‌ చెర్యాల మోహన్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు  శ్రీనివాస్‌, డీసీఎంఎస్‌ జిల్లా డైరెక్టర్‌ సండ్రుగు స్వామి, ఇబ్రహీంపూర్‌ సొసైటీ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, రమేశ్‌, సత్యనారాయణ, రామాయంపేట ఏడీఏ వసంత సుగుణ, ఏఏవో మాధవి, శోభ, భువనేశ్వరి, ప్రవీణ్‌ ఉన్నారు.

మొక్కలను సంరక్షించాలి : ఎమ్మెల్యే  మహిపాల్‌రెడ్డి 

అమీన్‌పూర్‌: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి పెద్దఎత్తున స్పందన లభిస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం అమీన్‌పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మల్లికార్జుననగర్‌ కాలనీలో మున్సిపల్‌ చైర్మన్‌ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత  మ నందరిపై ఉందన్నారు. హరితహారం కార్యక్రమం నిరంతరాయం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సుజాత, వైస్‌ చైర్మన్‌ నరసింహాగౌడ్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

బెజ్జంకి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతా .. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ 

బెజ్జంకి: జిల్లాలో బెజ్జంకిని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని  రసమయి బాలకిషన్‌ అన్నారు. మండలంలోని వడ్లూర్‌లో సీసీరోడ్లు, నూతన పంచాయతీ భవన, బేగంపేటలో అదనపు తరగతి గదులు, ముత్తన్నపేటలో సీసీ రోడ్లు, మహిళా సమాఖ్య భవనం, చీలాపూర్‌పల్లి, పెరుకబండలో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. హరితహార కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. పెరుకబండలో చెత్తబుట్టలను పంపిణీ చేశారు. లక్ష్మీపూర్‌ సర్పంచ్‌ బాపురెడ్డిని ఎమ్మెల్యే పరామర్శించారు. ఎంపీపీగా లింగాల నిర్మల ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మండల పరిషత్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌చేశారు.  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీసీ రోడు, మహిళా సమాఖ్య భవన నిర్మాణాల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ముత్తన్నపేట గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి స్థలాన్ని ఇచ్చిన గుర్రాల బాలనర్సింహారెడ్డిని ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, సర్పంచ్‌లు అనిత, సంజీవరెడ్డి, మమత, రాజేశం, సరోజన, ఎంపీటీసీలు రాజు, లత, స్రవంతి పాల్గొన్నారు.logo