శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jul 04, 2020 , 02:47:18

ఇంత అలసత్వమా!

ఇంత అలసత్వమా!

  • n అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు
  • n సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు
  • n డంపింగ్‌యార్డు, వైకుంఠధామ నిర్మాణ పనుల్లో జాప్యంపై సీరియస్‌
  • n సంగుపేట్‌ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌కు షోకాజ్‌ నోటీస్‌

వట్‌పల్లి: ‘ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇ బ్బందులు రాకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది.. అందులో భాగంగా అన్ని గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నది.. వీటిని త్వరగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని పదే పదే సూచిస్తున్నా, మీ గ్రామంలో మాత్రం ఏం పురోగతి కనిపించ డం లేదు.. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి ప నుల విషయంలో ఇంత అలసత్వంగా ఉంటే ఎ లా?’.. అని అందోల్‌ మండలం సంగుపేట సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ను సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు ప్రశ్నించారు. గురువారం అందోల్‌ మండలం రోళ్లపాడ్‌, కన్సాన్‌పల్లి, సంగుపేట గ్రా మాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రా మాల్లో నిర్మిస్తున్న డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాల ని, ఎలాంటి స్థితిలోనూ జాప్యం జరుగొద్దని సూ చించారు. తడి, పొడి చెత్తను వేరుగా వేసేలా ప్రజలకు సర్పంచ్‌లు, పంచాయతీ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. హరితహారంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములు చేసి, పెద్ద ఎత్తున మొక్క లు నాటేలా చూడాలన్నారు. డంపింగ్‌ యార్డులు పూర్తయిన తర్వాత, వర్మీకంపోస్టు తయారీపై దృష్టి పెట్టాలన్నారు. సంగుపేటలో వైకుంఠధా మం, డంపింగ్‌ యార్డును పరిశీలించిన కలెక్టర్‌, పనుల సరిగా జరుగకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనిపై సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ నుం చి సరైన సమాధానం రాకపోవడంతో వారిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ ఎర్రోళ్ల భాగ్యమ్మ, ఉప సర్పంచ్‌ మాణెమ్మకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, పనుల్లో నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో పర్యటించి, పనులు పరిశీలిస్తానని, ఎక్కడా పనులు జరుగకపోయినా చర్యలుంటాయని స్పష్టం చేశారు.


logo