శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sangareddy - Jul 03, 2020 , 02:57:59

సర్కారు జిమ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

సర్కారు జిమ్‌లను సద్వినియోగం చేసుకోవాలి

  • ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి

దుబ్బాక టౌన్‌ : ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిమ్‌లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. గురువారం దుబ్బాక పెద్ద చెరువు కట్టపై ఎస్‌డీఎఫ్‌ నిధులతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.  దుబ్బాక ప్రజల కల నేరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో ఇప్పటికే రామసముద్రం చెరువు కట్టపై ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయగా రూ.20 లక్షల నిధులతో కొత్తగా పెద్ద చెరువు కట్టపై  మున్సిపాలిటీలోని లచ్చపేట, ధర్మాజిపేట, దుంపలపల్లి, చెల్లాపూర్‌ వార్డుల్లో ఓపెన్‌ జిమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. పట్టణంలో ప్రత్యేకంగా మహిళల కోసం షీ టీంల పర్యవేక్షణలో ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రామసముద్రం చెరువు కట్టపై  పిల్లల ఆట పరికరాలను దుండగులు చోరీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాకలోని రెండు చెరువు కట్టలతో పాటు ప్రధాన ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కట్టుదిట్టం చేశామన్నారు.  

హరితహారంలో దుబ్బాకను మొదటి స్థానంలో నిలుపుతాం...

హరితహారంలో దుబ్బాక నియోజకవర్గాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలుపుతామని ఎమ్మెల్యే రామలింగారెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాక పెద్ద చెరువు కట్టపై సిద్దిపేట వీ-మార్ట్‌ యజమాని తడకమడ్ల విశ్వం సహకారంతో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత, కమిషనర్‌ నర్సయ్య, కౌన్సిలర్లు రజిత, మల్లారెడ్డి, యాదమ్మ, లలిత, రాజవ్వ, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆసస్వామి, రొట్టె రమేశ్‌, మూర్తి శ్రీనివాస్‌ రెడ్డి, పర్స కృష్ణ, నందాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


logo