బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 03, 2020 , 02:58:00

చెక్‌డ్యాంల నిర్మాణ పనులు పూర్తి చేయండి

చెక్‌డ్యాంల నిర్మాణ పనులు పూర్తి చేయండి

  • చిన్న నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ హమీద్‌ ఖాన్‌

హుస్నాబాద్‌ : మండలంలోని చెక్‌డ్యాంల నిర్మాణ పనులను సత్వరంగా పూర్తి చేయాలని చిన్న నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ ఎంఏ హమీద్‌ ఖాన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం హుస్నాబాద్‌లోని పందిల్ల వాగుపై రూ.4.55కోట్లు, పొట్లపల్లిలోని రేణుకా వాగుపై రూ.3.85కోట్లతో నిర్మిస్తున్న చెక్‌డ్యాంల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగుల నుంచి వృథాగా పోతున్న నీటిని ఒడిసిపట్టి చుట్టుపక్కల బావులు, బోర్లలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చెక్‌డ్యాంలను నిర్మిస్తోందన్నారు. ఆయన వెంట సిద్దిపేట జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, నీటిపారుదల శాఖ సంగారెడ్డి సర్కిల్‌ ఎస్‌ఈ మురళీధర్‌, సిద్దిపేట ఈఈ శ్రీనివాస్‌, ఏఈ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

కోహెడ మండలంలో..

కోహెడ : మండలంలోని విజయనగర్‌ కాలనీ సమీపంలోని ఎల్లమ్మ వాగుపై నిర్మిస్తున్న చెక్‌డ్యాం పనులను గురువారం చిన్న నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ హమీద్‌ఖాన్‌, ఎస్‌ఈ మురళీధర్‌లు పరిశీలించారు. పనుల్లో నాణ్యత లోపించవద్దని సూచించారు. వారి వెంట వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, నాయకులు కొక్కుల సురేశ్‌, విజయనగర్‌ కాలనీ సర్పంచ్‌ మెట్టు రాజేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ నరాల లింగం ఉన్నారు.logo