బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jul 03, 2020 , 02:58:09

డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

  •   సంగారెడ్డి  జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు

ఝరాసంగం :  విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని ఎల్గొయి, పొట్టిపల్లి, చీలపల్లితండా గ్రామాల్లో అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆధి కారులను ఆదేశించారు. తడి,పొడి చెత్తలను వేరు చేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, ఊరూరా హరితహారం మొక్కలు నాటి  వాటిని సంరక్షించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఆయన వెంట డీపీవో  వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుజా త, ఎపీవో రాజ్‌కుమార్‌, ఆయా గ్రామాల సర్పంచులు ఓంప్రకాశ్‌ పటేల్‌, విజయ్‌కుమార్‌, ధన్‌రాజ్‌పటేల్‌, పంచాయతీ కార్యదర్శులు ధన్‌రాజ్‌, చంద్రశేఖర్‌, శ్రీధర్‌స్వామి ఉన్నారు. 

  రైతువేదికల నిర్మాణాలను చేపట్టాలి..

రైతు వేదికల నిర్మాణాలను యుద్ధ్దప్రాతిపదికన పనులు జరుగాలని, అందుకు వ్యవసాయాధికారులు బాధ్యత తీసుకుని పనులు చేయించాలని కలెక్టర్‌  హనుమంతరావు అధికారులను అదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రైతువేదికల నిర్మాణాలపై ఆయా ఏజెన్సీలు, తహసీల్దార్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సర్పంచ్‌లు, డీఈలతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ల  అధికారులు రైతు వేదికల స్థలాలు గుర్తించేందుకు సమన్వయం చేసిన అదనపు కలెక్టర్‌ వీరారెడ్డిని అభినందించారు. ఈ నెలాఖరులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులదేనని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలో 116 రైతు వేదికలకు స్థలాలు గుర్తించామని,  నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే ఎక్కడైనా రైతు వేదికకు కేటాయించిన స్థలం సరియైనదిగా లేకుంటే సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని చెప్పారు. సమీక్షలో జడ్పీ సీఈవో రవి, వ్యవసాయశాఖ జేడీ నర్సింహరావ్‌, పీఆర్‌ఈఈ దామోదర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు మెంచు నగేశ్‌గౌడ్‌, రమేశ్‌బాబు, అంబాదాస్‌ రాజేశ్వర్‌, డీఈలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదు : మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి

చిన్నశంకరంపేట : పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యం వహించే సర్పంచ్‌లపై చర్యలు తప్పవని కలెక్టర్‌ ధర్మారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన మండల పరిధిలోని చందంపేట, రుద్రారం, చందాపూర్‌, గవ్వలపల్లి గ్రామాల్లో డంపింగ్‌ యార్డు నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డంపింగ్‌ యార్డు నిర్మాణాల్లో  నిర్లక్ష్యం వహిస్తున్న చందాపూర్‌, చందంపేట సర్పంచ్‌లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని డీపీవో హనోక్‌ను ఆదేశించారు. ఈ నెల 7తేదీ వరకు డంపింగ్‌యార్డు నిర్మాణాలను పూర్తి చేయాలని ఆధికారులకు సూచించారు. గవ్వలపల్లిలో సేంద్రియ ఎరువుల తయారీని  పరిశీలించి కలెక్టర్‌ సర్పంచ్‌ మంగాదేవిని అభినందించారు. ఆయన వెంట  డీఆర్డీఏ పీటీ శ్రీనివాసరావు, ఎంపీడీవో లక్ష్మణమూర్తి, తహసీల్దార్‌ రాజేశ్వర్‌రావు, సర్పంచ్‌లు రమాదేవి, శ్రీలత, లక్షణ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఏకే. యాదవరావు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.


logo