శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jul 01, 2020 , 03:28:48

రైతువేదికలు త్వరితగతిన పూర్తిచేయాలి

రైతువేదికలు త్వరితగతిన పూర్తిచేయాలి

  • సంగారెడ్డి కలెక్టర్‌ హనుమంతరావు

హత్నూర/కంది/చేగుంట/మనోహరాబాద్‌: రైతుల సం క్షేమం కోసం గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను త్వరిత గతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. మంగళవారం హత్నూర మండలం కాసాల గ్రామశివారులో, కంది మండలంలోని చిద్రుప్ప, కంది గ్రామాల్లో  నిర్మిస్తున్న రైతువేదిక నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతువేదికల నిర్మాణ పనులు ప్రారంభించామని, త్వరలోనే వాటిని అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు రైతువేదికల నిర్మాణం కోసం స్థలాలు గుర్తించి వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించాలన్నారు. వైకుంఠధామాలు, డంపింగ్‌యార్డు పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలన్నారు. నార్సింగి మం డలంపలోని శేరిపల్లిలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, తహసీల్దార్‌ జయరాం, ఎంపీవో సువర్ణ, కంది సర్పంచ్‌ విమలవీరేశం, చిద్రుప్ప సర్పంచ్‌ తాళ్లపావని, ఎంపీడీవో జయలక్ష్మి, తహసీల్దార్‌ రమాదేవి, ఆర్‌ఐ సంతోష్‌ పాల్గొన్నారు.

రైతు వేదికల భవన నిర్మాణ పనులకు భూమి పూజ  

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీచైర్‌ పర్సన్‌ ర్యాకల హేమలతాశేఖర్‌గౌడ్‌ అన్నారు. మనోహరాబాద్‌, కూచారం గ్రామాల్లో రూ.44లక్షలతో నిర్మించబోయే రైతు వేదికల భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అనంతరం కూచారం హరితవనంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో వరలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ మెట్టు బాలకృష్ణారెడ్డి, ఎంపీడీవో జైపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ శ్రీదేవి, ఏవో స్రవంతి, ఏఈవో సచిన్‌ పాల్గొన్నారు.