సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jul 01, 2020 , 03:29:01

సింగూర్‌ ప్రాజెక్టులోకి 0.3 టీఎంసీల నీరు చేరిక

సింగూర్‌ ప్రాజెక్టులోకి 0.3 టీఎంసీల నీరు చేరిక

  • డ్యాం ఎగువ భాగంలో కురిసిన భారీగా కురుస్తున్న వర్షం
  • ప్రాజెక్టులో ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు

పుల్కల్‌ : సింగూర్‌ ప్రాజెక్టులోకి 0.3 టీఎంసీల నీరు చేరింది. ప్రాజెక్టు ఎగువ భాగంలో మూడు రోజులుగా కురుస్తున్న వానకు డ్యాంలోకి మూడు వేల క్యూసెక్కుల నీరు చేరిందని నీటిపారుదల శాఖ ఏఈ మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం డ్యాంలో అర టీఎంసీ నీరు మాత్రమే ఉంది. 0.3 టీఎంసీలు నీరు చేరడంతో డ్యాంలో 0.8 సామర్థ్యానికి నీరు చేరింది. వానకాలం ప్రారంభం నుంచి మొదటి సారి డ్యాం పరిసర ప్రాంతం మునిపల్లి మండలంలోని దుబ్బవాగు పొంగిపొర్లడంతో ఆ నీరంతా డ్యాంలోకి వచ్చింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మునిపల్లి, రాయికోడ్‌, ఝరాసంఘం, జహీరాబాద్‌, రేగోడ్‌ మండలాల్లో కురిసిన వాన నీరు డ్యాంలోకి చేరింది. మంగళవారం రాత్రి వరకు మరో 800 క్యూసెక్కుల నీరు చేరుతుందని ప్రాజెక్టు అధికారి తెలిపారు. గత ఏడాది వర్షాలు కురువక డ్యాంలోకి చుక్కనీరు చేరలేదు.logo