శనివారం 08 ఆగస్టు 2020
Sangareddy - Jun 30, 2020 , 02:36:25

పాశమైలారంలో 25 మందికి పాజిటివ్

పాశమైలారంలో 25 మందికి పాజిటివ్

  • n సంగారెడ్డి జిల్లాలో కరోనాతో   మరొకరి మృతి
  • n ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న కేసులు

సంగారెడ్డి మున్సిపాలిటీ: ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని ఓ ప్రముఖ ఫార్మా కంపెనీలోని 25మందికి పాజిటివ్ రాగా, పోతిరెడ్డిపల్లికి చెందిన మహిళ మృతి చెందింది. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మహిళకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. ఇటీవల జిల్లా దవాఖానలో పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ వచ్చిందని, కరోనా లక్షణాలు కనిపించడంతో ఉస్మానియాలో పరీక్షలు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ తేలిందని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మోజీరాంరాథోడ్ వెల్లడించారు. జిల్లాలో కరోనా పాజిటివ్ ఆరుగురు మృతి చెందారని, సంగారెడ్డిలో మృతిచెందిన మహిళతో మొత్తం మృతుల సంఖ్య 7కు చేరిందని డీఎంహెచ్ తెలిపారు.

ప్రముఖ ఫార్మా పరిశ్రమలో కరోనా కలకలం

పటాన్ ప్రముఖ ఫార్మా పరిశ్రమలో కరోనా కలకలం సృష్టించింది. 25 మందికి కరోనా పాజిటివ్ రావడంతో పరిశ్రమ సిబ్బంది భయాందోళనకు గురువుతున్నారు. పటాన్ మండలం పాశమైలారం పారిశ్రామికవాడకు ఆనుకొని ఇంద్రకరణ్ గ్రామ పరిధిలో నెలకొల్పిన ప్రముఖ ఫార్మా కంపెనీలో 25 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరందరినీ ఈఎస్ ప్రైవేట్ దవాఖానకు  తరలించారు.  

అమీన్ మరో ఐదు కరోనా కేసులు 

అమీన్ అమీన్ మున్సిపాలిటీ పరిధిలో సోమవారం మరో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ పరిధిలోని మాధవపురి హిల్స్, జయలక్ష్మీనగర్ కాలనీ, లక్ష్మీసాయి మీడోస్ కాలనీ, భవానీపురం, సెంటాన్ గ్రీన్ పార్కు కాలనీల్లో మొత్తం 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధ్దారణ అయినట్ల అధికారులు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సుజాత కాలనీల్లో పర్యటించి వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్ ఉండాలని ఆదేశించారు. 

 దోమడుగులో ఓ వ్యక్తికి.. 

గుమ్మడిదల:  మండలంలోని దోమడుగు గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు  వైద్యాధికారులు తెలిపారు. దోమడుగు గ్రామానికి చెందిన వ్యక్తి కరోనా లక్షణాలు కనిపించగా, వైద్య పరీక్షలు చేశారు.  కరోనా పాజిటివ్ వచ్చినట్లు డీఎంహెచ్ మోజీరాం రాథోడ్, పీహెచ్ డాక్టర్ లక్ష్మి వెల్లడించారు.  

అర్జున్ ఓ వ్యక్తికి కరోనా.. 

మద్దూరు: మండలంలోని అర్జున్ గ్రామానికి చెందిన 50ఏండ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు  ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ రాజు తెలిపారు. సోమవారం గ్రామాన్ని వైద్యాధికారుల బృందం సందర్శించి కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులను వేర్వేరుగా హోం క్వారెంటైన్ ఉండాలని సూచించారు.  

తూప్రాన్ ఇంటింటా సర్వే  

తూప్రాన్ రూరల్: పట్టణంలో కంటైన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని  పీహెచ్ డాక్టర్ ఆనంద్ ప్రజలకు సూచించారు. ఇటీవల కరోనాపాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న 5 మంది, సెకండరీ కాంటాక్ట్ ఉన్న 19 మందిని గుర్తించి వారిని హోం ఐసోలేషన్ ఉండాలని ఆదేశించారు. సీహెచ్ బాల్ వైద్యసిబ్బందితో కలిసి సోమవారం ఆయన కంటైన్ ప్రకటించిన ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఖాజామొజియోద్దీన్ సమావేశమై హోం క్వాంరంటైన్ ఉన్న వారికి  నిత్యావసర సరుకులు అందజేయాలని  సూచించారు.  

గుర్రాలగొందిలో వైద్యసిబ్బంది పర్యటన 

నారాయణరావుపేట: మండలంలోని గుర్రాలగొంది గ్రామంలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ రాగా, అధికారులను గ్రామస్తులను అప్రమత్తం చేశారు. చిన్నకోడూరు ఎస్సై సాయికుమార్ వైద్య సిబ్బందితో  గ్రామంలో పర్యటించి  వివరాలు అడిగి తెలుసుకున్నారు.   

సీఎం కేసీఆర్ రుణపడి ఉంటాం..  ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

చేర్యాల: సీఎం కేసీఆర్, టీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన మనోధైర్యంతో తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. సోమవారం జనగామ నియోజకవర్గ టీఆర్ కో-ఆర్డినేటర్ గుజ్జ సంపత్ కలిసి ఆయన విలేకరులతో ఫోన్ మాట్లాడారు. త్వరలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజలకు సేవలందిస్తానని పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చిన సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తాము కోలుకోవాలని పూజలు నిర్వహించిన తన సహచర ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు.


logo