ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 28, 2020 , 02:18:37

వానకాలం పాములతో జాగ్రత్త

వానకాలం పాములతో జాగ్రత్త

  • n అప్రమత్తం లేకుంటేఅంతే సంగతులు
  • n నాటు వైద్యం వద్దు దవాఖానే సురక్షితం 
  • n ప్రభుత్వ దవాఖానల్లో యాంటీ  ఇంజక్షన్లు

దౌల్తాబాద్ : వానకాలం సీజన్ ప్రారంభమైంది. భూమి బొరియలు పుట్టల్లోకి నీరు చేరి అందులోని పాములు బయటకు వస్తుంటాయి. ఇండ్ల సమీపంలో ముళ్ల పొదలు, కట్టెలు, మొద్దులు, చెత్తాచెదారం ఉంటే వాటి మాటున చేరుతాయి. ఎలుకలు, లైట్ల వెలుతురుకు వచ్చే కీటకాలను తినేందుకు ఇండ్లల్లోకి వస్తాయి.  ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్న తరుణం.. రైతన్నలకు  పాముల బెడద ఎక్కువగానే ఉంటుంది. గొర్రెలు మేకలు, ఆవులను కాసేందుకు అడవులకు వెళ్లే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.  

కొన్ని పాములు ప్రమాదం కాదు..

రకరకాల పాములు ఉంటాయి. కొన్ని విష పాములు ఉండగా, కొన్నింటితో అంతగా ప్రమాదం ఉండదు.  నాగుపాము, పెంజర, కట్లపాము వంటివి విష సర్పాలు,  వానకోయిల, నాగులవాసం, నీరుకట్టె, జెర్రిపోతు వంటివి విషం లేని పాములు. పాము కాటు కన్నా..   భయంతోనే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు.  

నాటు వైద్యంతో ముప్పే.

పాముకాటు వేసిన వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి. చాలా మంది మూఢనమ్మకాలతో మంత్రగాళ్లను ఆశ్రయిస్తారు. పాముల్లో చాలా వాటికి విషం ఉండదు... ఇవి కాటువేసినా పెద్దగా ప్రమాదం ఉండదు. దుస్తులపై నుంచి పాముకాటు వేసినప్పుడు కూడా ప్రభావం తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మంత్రగాళ్ల వద్దకు తీసుకెళ్లినప్పుడు కొందరు  బతుకుతారు. వారే బతికించారని నమ్ముతారు. విష సర్పాలు కాటేసినప్పుడు తప్పకుండా దవాఖానకు తీసుకెళ్లాలి. లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది.

అందుబాటులో ఇంజక్షన్లు 

పాముకాటుకు గురైనప్పుడు తక్షణమే స్పందించి వైద్యం అందేలా చూడాలి. వారిని నడిపించకూడదు. దౌల్తాబాద్, సిద్దిపేట, గజ్వేల్ దవాఖానల్లో పాము  గురైనవారికి యాంటీ వీనమ్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా భయాందోళనకు గురికావొదువ. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవాలి.

-డాక్టర్ రమాదేవి, దౌల్తాబాద్ మండల పీహెచ్ logo