శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Jun 28, 2020 , 02:23:31

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదు

శాంతిభద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదు

  • పాశమైలారంలో ఔట్ ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా ఎస్పీ 

పటాన్ : మండలంలోని బీడీఎల్ పోలీస్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో పరిశ్రమల సంఘం (ఐలా), టీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన పోలీస్ ఔట్ శనివారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ ప్రారంభించి, మొక్కలను నాటారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీపడేది లేదన్నారు. జిల్లాలో నేరాలు తగ్గాయన్నారు.  పరిశ్రమల్లో జరిగే నేరాలను అదుపు చేసేందుకు ఈ ఔట్ ఉపయోగపడుతుందన్నారు.  ఒక ఎస్సై, 9 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రాజేశ్వరరావు, ఐలా అధ్యక్షుడు చందుకుమార్ కార్యదర్శి దుర్గాప్రసాద్, రాఘవరెడ్డి, జోనల్ మేనేజర్ కళావతి, సీఐ రాంరెడ్డి, డీజడ్ భవానీ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo