మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Jun 28, 2020 , 01:05:52

రైతు ప్రభుత్వమిది

రైతు ప్రభుత్వమిది

  • n అన్నదాతను రాజును చేయాలన్నదే ధ్యేయం
  • n అర్హులందరికీ డబుల్ బెడ్ ఇండ్లు
  • n ఉమ్మడి జిల్లాలకు రూ.112కోట్లతో 22 రోడ్లు మంజూరు
  • n ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్
  • n శివ్వంపేటలో డబుల్ రూం ఇండ్లు, సబ్ ప్రారంభం
  • n జడ్పీ అధ్యక్షురాలు హేమలతాశేఖర్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి హాజరు
  • n నర్సాపూర్ నాలుగు  నియోజకవర్గాల అభివృద్ధిపై సమీక్ష

మనోహరాబాద్ : ఇది రైతు ప్రభుత్వమని, పేదలు, అన్నదాతల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ అన్నారు. శనివారం జడ్పీ అధ్యక్షురాలు హేమలతాశేఖర్ కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే చిలుముల మదన్ మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డితో కలిసి శివ్వంపేట మండలం దంతాన్ సికింద్లాపూర్ పిట్టలవాడలో డబుల్ బెడ్ ఇండ్లు, గుండ్లపల్లిలో సబ్ ప్రారంభించారు. పెద్దగొట్టిముక్ల, గౌరారం గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి, నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి హరీశ్ మాట్లాడారు. మెదక్ జిల్లాలో చాలా గ్రామాల్లో డబుల్ రూం ఇండ్ల నిర్మాణాలు చివరిదశకు చేరుకున్నాయని, జిల్లాలో మొదటి సారిగా నర్సాపూర్ నియోజకవర్గం దంతాన్ సికింద్లాపూర్ గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. ఇంతకు ముందు పగటిపూట ఊర్లో కరెంట్ ఉంటుం దా? రైతుబంధు కింద రూపాయి వచ్చేదా? మోటార్లు, ట్రాన్స్ కాలకుండా ఒక్క యాసంగి పంటనన్న పండిందా? అని మునుపటి రోజులను గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. గుండ్లపల్లిలో రూ.కోటి 50 లక్షల నిధులతో సబ్ ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకే నియంత్రిత సాగును ప్రభుత్వం తెచ్చిందని, దీనిపై రైతులు దృష్టి సారించాలన్నారు. రైతులు భూములను కాపాడుకోవాలని, ఫాంహౌస్ రియల్ అమ్ముకోవద్దన్నారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం జలాలు, 24గంటల ఉచిత విద్యుత్ యేడాది పొడవున కరువు అనేది లేకుండా వ్యవసాయం జరిగి, తెలంగాణలో రైతులే రాజులు కానున్నారన్నారు.  పేదలకు రూపాయి ఖర్చు లేకుండా డబుల్ బెడ్ పథకాన్ని ప్రవేశపెట్టి, నిర్మించి ఇస్తోందన్నారు. ఇండ్లు సరిపోకపోతే మరిన్ని ఇండ్లను మంజూరు చేయించి, అర్హులందరికీ అందజేస్తామన్నారు. నర్సాపూర్ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందుతున్నదన్నారు. గోదావరి జలాలు త్వరలోనే హల్దీ, మంజీరా వాగుల్లో ప్రవహించనున్నాయన్నారు. శివ్వంపేట మండలానికి సైతం గోదావరి జలాలు పుష్కలంగా అందుతాయన్నారు. అనంతరం రైతుబంధు డబ్బులు వచ్చాయా.. అని సభకు హాజరైన రైతులను అడిగారు. దీంతో వారు వచ్చాయని బదులిచ్చారు. దంతాన్ దేవాదాయశాఖ భూములంటూ రైతులు సాగు చేస్తున్న వాటికి పట్టా పాసుపుస్తకాలు ఇవ్వడం లేదని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే మదన్ తీసుకురాగా, ఆ భూముల సమస్య తన దృష్టికి వచ్చిందని, దేవాదాయశాఖ కూడా తమభూములు కావని రైతులకు ఎన్ ఇచ్చిందని, ఆ రికార్డులను పరిశీలించి, అవకాశముంటే, 10రోజుల్లో రైతులకు పట్టా పాసుపుస్తకాలను తయారు చేసివ్వాలని కలెక్టర్ ధర్మారెడ్డికి సూచించారు. 

పీఎంజీఎస్ కింద నిధులు మంజూరు... 

ఉమ్మడి మెదక్ జిల్లాకు పీఎంజీఎస్ కింద 170 కిలోమీటర్లకు రూ.112 కోట్లతో 22 రోడ్లు మంజూరయ్యాయని, ఎమ్మెల్యే మదన్ కృషితో రూ.13 కోట్ల నిధులతో మూడు రోడ్లు నర్సాపూర్ నియోజకవర్గానికి నిధులు మంజూరయ్యాయని మంత్రి హరీశ్ అన్నారు. ఇవేకాకుండా రెండో విడుతలో మరిన్ని ప్రతిపాదనలను పెట్టామని, నర్సాపూర్ నియోజకవర్గానికి మొదటి విడుతలో రూ. 13 కోట్లు మూడు రోడ్లు, రెండో విడుతలో మరో రూ.10 కోట్ల నిధులతో రెండు రోడ్లకు ప్రతిపాదలు పంపామన్నారు. అవికూడా త్వరలోనే మంజూరుకానున్నాయన్నారు. వచ్చిన నిధులకు వారం, పదిరోజుల్లో టెండర్లను పూర్తి చేసి పనులను ప్రారంభిస్తామన్నారు. కరోనా క్లిష్ట పరిస్థితిలోనూ నియోజకవర్గ అభివృద్ధికి  సీఎం కేసీఆర్ రూ. 75 కోట్ల నిధులను మంజూరు చేశారన్నారు.

అభివృద్ధిలో అగ్రగామిగా..

నర్సాపూర్ : అభివృద్ధిలో ఉమ్మడి జిల్లా అగ్రగామిగా నిలవాలని, అందుకు అధికారులు కష్టపడి పని చేయాలని మంత్రి హరీశ్ అన్నారు. శనివారం నర్సాపూర్ సమీపంలోని నర్సాపూర్, దుబ్బాక, సిద్దిపేట, అందోలు తదితర నియోజకవర్గాల మండల స్థాయి అధికారులతో ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష నిర్వహించారు. దీనికి నర్సాపూర్, దుబ్బాక, అందోల్ ఎమ్మెల్యేలు మదన్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, క్రాంతికిరణ్, కలెక్టర్ ధర్మారెడ్డి, అడిషనల్ కలెక్టర్ నాగేశ్, జడ్పీ అధ్యక్షురాలు హేమలత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ తదితరులు హాజరయ్యారు. గ్రామాల్లో జరుగుతు న్న వైకుంఠధామాలు, డంపింగ్ యార్డు, పల్లెప్రకృతి వనాలు త దితర పనులు ముందుకు సాగకుంటే, అధికారులు పల్లె నిద్ర చేసి, పనులను వేగవంతం  చేయించాలని సూచించారు. విధు ల్లో నిర్లక్ష్యం చేసే అధికారులను తొలగించి, ఆ స్థానంలో చురుకైన వారిని నియమిస్తామని చెప్పారు. అభివృద్ధి పనులు అడ్డుకునే సర్పంచులను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపా రు. 45రోజుల్లో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసి, ఉమ్మడి మెదక్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూ చించారు. ప్రతి పంచాయతీకి కచ్చితంగా ట్రాక్టర్ ఉండాలని, ట్రాక్టర్ లేని పంచాయతీలుంటే, ఆయా మండలాల ఎంపీడీవోలను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రైతు వేదికల నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మిబాయి, ఆయా నియోజకవర్గాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు అధికారులు  తదితరులు ఉన్నారు.


logo