బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jun 25, 2020 , 23:54:19

రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి

రెండు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలి

  • ఎమ్మెల్యే  భూపాల్‌రెడ్డి

నారాయణఖేడ్‌/కల్హేర్‌: రెండు నెలల్లో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రైతువేదికల నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కల్హేర్‌ మండలం ఖానాపూర్‌(కె), ఖానాపూర్‌(బీ), మునిగేపల్లి గ్రామాల్లో నూతనంగా నిర్మించిన డంపింగ్‌ యార్డులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ప్రారంభించారు.  నారాయణఖేడ్‌ మండలం నిజాంపేటలో రైతువేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. నియోజకవర్గంలోనే నిజాంపేటలో తొలి రైతువేదిక కోసం భూమిపూజ చేసినట్లు తెలిపారు. నిజాంపేట గ్రామానికి చెందిన రైతులు పొట్టి రాములు, అవుటి దేవయ్య ఇటీవల మరణించగా   మంజూరైన రైతుబీమా రూ.5లక్షల చెక్కులను ఎమ్మెల్యే, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి, సర్పంచ్‌ జగదీశ్వర్‌చారి పాల్గొన్నారు.


logo