శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jun 25, 2020 , 23:54:14

గృహ హింసకు పాల్పడితే కఠిన చర్యలు

గృహ హింసకు పాల్పడితే  కఠిన చర్యలు

  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి

సంగారెడ్డి టౌన్‌ : మహిళలపై గృహ హింసకు పాల్పడితే వారిపై చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయిరమాదేవి హెచ్చరించారు. గురువారం సంగారెడ్డిలోని సఖీ కేంద్రంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మహిళల సమస్యలు - పరిష్కార మార్గాలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ సఖీ కేంద్రం ద్వారా మహిళలకు భరోసా కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జడ్జి ఆశాలత, సఖీ కో-ఆర్డినేటర్‌ సుజాత తదితరులు పాల్గొన్నారు.logo