సోమవారం 10 ఆగస్టు 2020
Sangareddy - Jun 22, 2020 , 23:31:17

హరితహారాన్ని విజయవంతం చేయాలి

హరితహారాన్ని విజయవంతం చేయాలి

  •  వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మెదక్‌ :  మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ప్రతి ఇంటికి ఆరు మొక్కలను సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మెదక్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌, డీపీవో హనోక్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ రఘునందన్‌రావు,  ఉపాధి హామీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 


logo