గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 22, 2020 , 02:06:21

చింతగింజపై కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటం

చింతగింజపై కర్నల్‌ సంతోష్‌బాబు చిత్రపటం

పెద్దశంకరంపేట: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌ బాబు చిత్రపటాన్ని ఆదివారం చింతగింజపై పెద్దశంకరంపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు అవుసుల శ్రీనివాసాచారి సూక్ష్మరూపంలో రూపొందించాడు. దేశం కోసం గల్వాన్‌ లోయలో భారత సైనికులతో చైనా జరిపిన దాడిలో వీరమరణం పొందిన 19 మంది జవాన్లతో పాటు తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌బాబుకు నివాళులు అర్పిస్తూ చింతగింజపై సంతోష్‌ చిత్రపటం గీసి వారి కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. దీంతోపాటు చింతగింజపై భారతదేశ చిత్రపటం, మధ్యలో జాతీయపతాకం, మరో చింతగింజపై జవాన్లు ఉపయోగించే గన్నుతో పాటు టోపీ గీసీ అబ్బురపర్చాడు.


logo