శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - Jun 20, 2020 , 00:04:46

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్‌

నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్‌

  • సమావేశంలో మెదక్‌  జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌ : వర్షాకాలం మొదలైంది.. రైతులు విత్తనాలు విత్తుకునే సమయంలో ఫర్టిలైజర్ల దుకాణాల యజమానులు నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మెదక్‌ కలెక్టరేట్‌లో రైతు సమస్యలు, అటవీ, రెవెన్యూ శాఖల భూములకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా రైతులు విత్తనాలు, ఎరువులు విక్రయించేటప్పుడు తప్పకుండా రసీదు పొందాలని సూచించారు. మెదక్‌ జిల్లాలో కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు కచ్చితంగా  పాటించాలన్నారు.    ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడుత హరితహారాన్ని  25తేదీన ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. భూముల సర్వేను పక్కాగా చేపట్టాలని, ప్రభుత్వ, అటవీ భూములు కబ్జాకు గురి కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు.  జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి పరశురాంనాయక్‌, మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి, తూప్రాన్‌ డీఎస్పీ కిరణ్‌కమార్‌, అధికారులు పాల్గొన్నారు.logo