బుధవారం 28 అక్టోబర్ 2020
Sangareddy - Jun 20, 2020 , 00:03:31

అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలి

అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలి

  • అధికారుల సమీక్షలో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి 

సిద్దిపేట కలెక్టరేట్‌ :  ‘రైతు వేదికలు.. డంపింగ్‌యార్డులు.. వైకుంఠధామాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి’.. అందుకు కావాల్సిన భూసేకరణ జరుపాలి.. ఇసుక సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదు.. హరితహారంలో జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో ఇసుక కమిటీ, హరితహారం, భూసేకరణ వంటి అంశాలపై  ఏర్పాటు చేసిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమైన ఇసుకను సరఫరా చేయాలని.. ఎక్కడెక్కడ ఎంత ఇసుక అవసరం ఉందనే నివేదికలు రూపొందించి అధికారులకు సమర్పించాలన్నారు. ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలను వెంటనే సిద్ధం చేయాలని పీఆర్‌ ఈఈ కనకరత్నాన్ని ఆదేశించారు. కమిటీ చైర్మన్‌గా  కలెక్టర్‌, సభ్యులుగా అదనపు కలెక్టర్లు పద్మాకర్‌, ముజామ్మిల్‌ఖాన్‌, ఆర్డీవోలు, ఏడీ మైనింగ్‌, ఇరిగేషన్‌ ఈఈ, గ్రౌండ్‌ వాటర్‌ అధికారి, డీపీవో సురేశ్‌బాబు ఉన్నారు. హరితహారంలో సిద్దిపేట జిల్లాను మొదటి స్థానంలో నిలుపాలని కలెక్టర్‌ అన్నారు. గతంలో కంటే ఈ సంవత్సరం మరింత అద్భుతంగా చేపట్టాలని అటవీ శాఖ అధికారి శ్రీధర్‌కు, జిల్లా పరిధిలో ఇంకా ఎక్కడైన మిగిలిన స్థలాలు ఉంటే అక్కడ గ్రీనరీ ఉండేలా మొక్కలు నాటాలని సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డికి సూచించారు.


logo