గురువారం 13 ఆగస్టు 2020
Sangareddy - Jun 19, 2020 , 01:09:56

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చూడాలి

  •  జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజారాధాకృష్ణశర్మ 

సిద్దిపేట కలెక్టరేట్‌ : ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చూడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన 1, 5, 6 స్థాయీ సంఘం సమావేశాల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కరోనా నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడాలన్నారు.  జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీసీలు ఎల్‌ యాదగిరి, రణం జ్యోతి, ప్రవళిక, కుంభాల లక్ష్మి, కడతాల రవీందర్‌రెడ్డి, కవిత, జడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo