బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jun 17, 2020 , 23:46:46

పరిశుభ్రతంపై అవగాహన కల్పించాలి

పరిశుభ్రతంపై అవగాహన కల్పించాలి

సంగారెడ్డి రూరల్‌: పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ లావణ్య అన్నారు. బుధవారం మండల ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎం పీపీ మాట్లాడుతూ తమకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారుల తీరు మార్చుకోవాలన్నారు. ప్రజలు తప్పకుండా మాస్క్‌లు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని జడ్పీటీసీ సునీత, తాసిల్దార్‌ స్వామి సూచించారు. విద్యావిధానంపై ప్రభు త్వం నిర్ణయం తీసుకున్నప్పుడే పాఠశాలు తెరుకోబడును ఎం ఈవో వెంకటనర్సింహాగౌడ్‌ అన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రైతులకు పచ్చరొట్టె విత్తనాలపై 65% రాయితీ ఇస్తున్నట్లు ఏవీజీకె ప్రసాద్‌ తెలిపారు. మండల మహిళా సమాఖ్య సంఘాల సభ్యులకు బ్యాంక్‌ లింకేజీ ద్వారా రుణాలు కల్పించి, తిరిగి సకాలంలో చెల్లించినందుకు రాష్ట్రంలోనే మొదటి స్థానంగా సంగారెడ్డి మం డలం నిలిచిందని ఐకేపీ ఏపీఎం వెంకట్‌ అన్నారు.  

 పోషణ్‌ అభియాన్‌ సభ.. 

 అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలింతలు, గర్భిణులకు పోషకాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్‌ సీడీపీవో రేణుక అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు అక్షయపాత్ర ద్వారా రోజుకు ఒక పూట భోజనం ఇంటికే సరఫరా చేయ నున్నామని ఆమె తెలిపారు.  కార్యక్రమంలో సూపర్‌వైజర్లు జయలక్ష్మి, సువర్ణ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.logo