శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jun 17, 2020 , 23:43:11

బాధ్యతాయుతంగా కార్యదర్శులు పని చేయాలి

బాధ్యతాయుతంగా  కార్యదర్శులు పని చేయాలి

  • కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి టౌన్‌ : పంచాయతీ కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్‌ హనుమంతరావు సూచించారు. బుధవారం సంగారెడ్డిలోని కలెక్టరేట్‌ నుంచి రె వెన్యూ డివిజన్‌ అధికారులు, డీఎల్‌పీఓలు, ఎంపీడీఓలు, త హసీల్దార్లు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా క లెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం తలపెట్టిన ప్రాధాన్యత పనుల పై దృష్టి సారించాలన్నారు. చార్జిడ్‌ అకౌంట్‌ కింద ప్రతి నెలా 1న చెల్లింపులు జరగాలన్నారు. బకాయిలుంటే, సంబంధిత పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్‌ చార్జీలు, ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌లోన్‌ రీపేమెంట్‌ కచ్చితంగా జరుగాలని, విద్యుత్‌ చార్జీలు విధిగా చెల్లించాలన్నారు. శానిటేషన్‌ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌లదని, పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎంపీవోలదన్నారు. వైంకుఠధామాలు, డంపుయార్డు నిర్మాణాలు 100శాతం పూర్తి చేయాలని, ఈ నెల 30వ తేదీ లోగా పూర్తి చేయాలని, లేనట్లయితే ఏఈ. డీఈలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తడిపొడి చెత్త విడివిడిగా ఇవ్వని వారికి ఈ నెల 21 నుంచి 30వరకు రూ.50 జరిమానా విధిస్తామన్నారు. జిల్లాలో 116 రైతు వేదికల నిర్మాణాలు రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. జిల్లాకు 5వేల కల్లాలు మంజూరైనందున నిర్మాణాలు జరిగేలా చూడాలన్నారు. ఈనెల 25వ తేదీ నుంచి హరితహారం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రారంభం కావాలన్నారు. అలాగే, నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్ముతున్న వారి వివరాలు తెలియజేస్తే రూ.5వేల బహుమతి అందజేస్తామన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, జడ్పీ సీఈఓ టి.రవి, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌రావు, డీపీఓ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ జేడీఏ నర్సింహారావు, పంచాయతీ, ఇరిగేషన్‌, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo