గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 17, 2020 , 01:08:19

అమీన్‌పూర్‌ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

అమీన్‌పూర్‌ అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

కల్యాణ లక్ష్మి,  షాదీముబారక్‌ చెక్కులు పంపిణీ

అమీన్‌పూర్‌ : అమీన్‌పూర్‌ నూతనంగా మండ లం, మున్సిపల్‌గా ఆవిర్భవించిందని,  అభివృద్ధిలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని బీరంగూడ ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థలాన్ని  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమీన్‌పూర్‌ హైదరాబాద్‌కు సరిహద్దు ప్రాంతం కావడంతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. త్వరలోనే భవన నిర్మాణాలు ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ తు మ్మల పాండురంగారెడ్డి, ఎంపీపీ దేవానంద్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నర్సింహాగౌ డ్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ తులసిరెడ్డి, కమిషనర్‌ సుజాత, ఎంపీడీవో మల్లేశ్వర్‌, కౌన్సిలర్లు బాశెట్టి కృష్ణ, కవితాశ్రీనివాస్‌రెడ్డి, కల్పనాఉపేందర్‌రెడ్డి, కొల్లూరి మల్లేశ్‌, యూసుఫ్‌, మల్లేశ్‌, నాయకులు శేఖర్‌, దాస్‌యాదవ్‌, యూనుస్‌ పాల్గొన్నారు. 

మురుగు కాల్వ పనుల పరిశీలన

పటేల్‌గూడ పంచాయతీలో కొనసాగుతున్న మురుగు నీటి కాల్వ పనులను ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు త్వరగా పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రావాలనిన్నారు. వానకాలంలో కాలనీల్లోకి వచ్చిన వరద నీరు ఇండ్లలోకి చేరే ప్రమాదం ఉందని, పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎంపీపీ దేవానంద్‌, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, నాయకులు శ్రీకాంత్‌, జ్ఞానేశ్వర్‌ ఉన్నారు.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ 

జిన్నారం : ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదని సీ ఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ప్రవేశపెట్టారని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. జిన్నారంలో 20 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, ఎంపీపీ రవీందర్‌గౌడ్‌, సర్పంచ్‌ లావణ్య, ఎంపీటీసీ వెంకటేశంగౌడ్‌, తహసీల్దార్‌ దశరథ్‌ పాల్గొన్నారు. logo