గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 15, 2020 , 23:54:29

ఓఆర్‌ఆర్‌పై 300 కేజీల గంజాయి పట్టివేత

ఓఆర్‌ఆర్‌పై 300 కేజీల గంజాయి పట్టివేత

  • l ఆరుగురు నిందితుల అరెస్ట్‌ l పట్టుబడిన గంజాయి విలువ  సుమారు  70 లక్షలు

పటాన్‌చెరు : ఓఆర్‌ఆర్‌ ముత్తంగి వద్ద మెదక్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో 300 కేజీల గంజాయి పట్టుబడింది. సోమవారం నిర్వహించిన సమావేశంలో  ఎక్సైజ్‌ శాఖ మెదక్‌ డివిజన్‌ డిప్యూటీ కమిషనర్‌ కేఏబీ శాస్త్రి  వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ గాయత్రి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల ఆధ్వర్యంలో  ముత్తం గి ఔటర్‌ రింగురోడ్డు జంక్షన్‌లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారని తెలిపారు. ఆంధ్ర, ఒరిస్సా బార్డర్‌ నుంచి వస్తున్న టయోటా ఇన్నోవా కారును తనిఖీ చేయగా అందులో 50 గంజాయి పాకెట్లు దొరికాయి. దీంట్లో ఉన్న సదాశివపేట్‌ మండలం ఆరూర్‌ గ్రామస్తులు కరీమొద్దీన్‌, మొయినాబాద్‌కు చెందిన మ్యా దరి ఆంజనేయులును అదుపులోకి తీసుకున్నారు. వారి వెనుక వస్తున్న  కారులో కూడా 50పాకెట్ల గంజాయి లభ్యమైంది. దీంట్లో ప్రయాణిస్తున్న రాయికోడ్‌ గ్రామానికి చెందిన మ్యాదరి లింగం, జహీరాబాద్‌ మండలం  మల్మెల గ్రామానికి చెందిన బానోత్‌ రవీందర్‌ నాయక్‌ను, కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా బాగ్దల్‌ తండాకు చెందిన వినాయక్‌లను అదుపులోకి తీసుకున్నారు. మరో సమాచారం మేరకు  ఒక కారును తనిఖీ చేయగా దాంట్లోను రెండు కిలోల బరువున్న 50 పాకెట్ల గంజా యి లభించింది. డ్రైవర్‌ జహీరాబాద్‌ మండలం హోతీ(బీ) గ్రామానికి చెందిన జోగు ప్రవీణ్‌ను పట్టుకున్నారు. మూడు కార్లను, వాటిలో ఉన్న గంజాయిని ఎక్సైజ్‌ పోలీసులు పటాన్‌చెరు స్టేషన్‌కు తరలించారు.   విచారణలో రెండు కార్లు జహీరాబాద్‌ మండలం మల్మెల్ల గ్రామానికి చెందిన బానోత్‌ శ్రీను, మరో కారు ఓనర్‌ మీన్‌పూర్‌ తండాకు చెందిన జరుపుల శ్రీనుగా గుర్తించారు. ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని శాస్త్రి తెలిపారు. బానోతు శ్రీను, జరకుల శ్రీను పరారీలో ఉన్నారని వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. మూడు వాహనాల్లో దాదాపు 300 కేజీల గంజాయిని పట్టుకున్నామన్నారు.  పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ. 70 లక్షలు  ఉంటుందని,  సీజ్‌ చేసిన వాహనాల విలువ కూడా రూ. 15 నుంచి 20 లక్షలుంటుందని తెలిపారు.  ఈ దాడుల్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ మెదక్‌ డివిజన్‌ సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారని వారిని ప్రశంసించారు.


logo