శనివారం 31 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 23:59:37

తల్లిదండ్రులకు తోడుగా..

తల్లిదండ్రులకు తోడుగా..

కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపథ్యం.. జూన్‌లో విద్యా సంస్థలు తెరుచుకోకపోవడంతో ఇంటి వద్ద ఉండలేక తల్లిదండ్రులకు వ్యవసాయంలో తోడుగా ఉంటున్నారు  కుమారులు. గజ్వేల్‌ మండల పరిధి కోనాపూర్‌కు చెందిన రైతు బాల్‌ నర్సయ్య కొడుకు సతీశ్‌ డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తండ్రికి సాయంగా పత్తి సాగుకు నాగలితో దున్నుతూ కనిపించగా, దాతర్‌పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు భాగ్యలక్ష్మికి ఇద్దరు కొడుకులు భాను, చందు పత్తి విత్తనాలు పెట్టేందుకు సహాయ పడుతున్న దృశ్యాలు శనివారం కనిపించాయి. 

- గజ్వేల్‌ రూరల్‌