మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 23:57:50

అప్రమత్తంగా ఉండాలి

అప్రమత్తంగా ఉండాలి

  • n  ఆగస్టు 15లోపు మరుగుదొడ్లు నిర్మించాలి
  • n  వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి కేటీఆర్‌

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌ : సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. శనివారం అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీల అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రత పట్టణాలుగా రూపుదిద్దుకునేలా చర్యలు చేపట్టాలని, ప్రతి మున్సిపాలిటీలో ఆగస్టు 15 లోపు లక్ష మంది జనాభాకు వంద మరుగుదొడ్ల చొప్పున నిర్మించాలన్నారు.  మరుగుదొడ్లలో పురుషులు, మహిళకు 50 శాతం కేటాయించాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీల్లో కూరగాయాల దుకాణాల సముదాయం, మాంసం విక్రయలు నిర్మించాలని కోరారు. ఆటోస్టాండ్‌, పార్కింగ్‌ ఏరియా  కచ్చితంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. హరితహారంలో కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి, సంరక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజర్షి షా, సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, కమిషనర్‌ శరత్‌చంద్ర, మెదక్‌లో జిల్లా అదనపు కలెక్టర్‌ నగేశ్‌, మున్సిపల్‌ చైర్మన్లు చంద్రపాల్‌, రాఘవేందర్‌ గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు నాటి సంరక్షించాలి.. 

 చేర్యాల  :  పట్టణ ప్రగతి, హరితహారం, సీజనల్‌ వ్యాధులపై శనివారం మంత్రి కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకుగారి స్వరూపరాణి, వైస్‌ చైర్మన్‌ నిమ్మ రాజీవ్‌ కుమార్‌ రెడ్డి, ఇన్‌చార్జి మున్సిపల్‌ కమిషనర్‌ పాల్వాయి శ్రవణ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల ప్రగతి, సీజనల్‌ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలను మంత్రి పలు సూచనలు చేశారు. హరితహారంలో ఇచ్చిన టార్గెట్‌ మేరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆదేశించారు.logo