శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 00:39:52

బాలలతో పనిచేయించొద్దు

బాలలతో పనిచేయించొద్దు

n పనులు చేపిస్తే జరిమానా, జైలుశిక్ష

n సీనియర్‌ సివిల్‌ జడ్జి పుష్పలత

సంగారెడ్డి: సమాజంలో బాల కార్మికులు, చిన్నారులతో పనులు చేయిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష తప్పదని సీనియర్‌ సివిల్‌ జడ్జి పుష్పలత తెలిపారు. శుక్రవారం ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని స్థానిక బాలసదనంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జడ్జి హాజరై మాట్లాడుతూ ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని జూన్‌ 12న నిర్వహించుకోవాలని సూచించారు.  కరోనా వైరస్‌ దరిచేరకముందు బాలకార్మికులపై ప్రభావం తక్కువ ఉండేదని ప్రస్తుతం ఎక్కువైందని గుర్తుచేశారు. వెట్టి చాకిరి, ఇటుకల తయారీ, భవన నిర్మాణ పనులతో పాటు ఇతర నిర్మాణాల్లో చిన్నారులకు  ప్రభావం ఎక్కువ ఉంటుందన్నారు.  ఈ కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ సుజాత, బాలసదనం సూపరింటెండెంట్‌ విజయ, శిశుగృహ మేనేజర్‌ లింగం  పాల్గొన్నారు.

బాలలను పనిలో పెట్టకోవద్దు

సంగారెడ్డి టౌన్‌ : బాలలను పనిలో పెట్టొద్దని మెడ్వాన్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి సూచించారు. శుక్రవారం సంగారెడ్డిలోని మెడ్వాన్‌ కార్యాలయంలో అంత ర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినాన్ని మెడ్వాన్‌, చైల్డ్‌ లైన్‌ (1098) ఆధ్వర్యంలో నిర్వహించారు. 

ఈ సం దర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ గృహా కార్మి కులు తమ పిల్లలను పనిలో పెట్టడం చట్టరీత్య నేర మ న్నారు. ఆడ,మగపిల్లలు 18 సంవత్సరాల లో పు వారి ని ఎలాంటి పనుల్లో పెట్టరాదన్నారు. ఈ కా ర్య క్రమ ంలో చైల్డ్‌లైన్‌ కోఆర్డి నేటర్‌ మెహజీబ్‌, చైల్‌ ్డలైన్‌ మెంబర్లు అమీదయ, పావణి, గీత, సృతి, పాల్గొన్నారు.