బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 00:36:39

పారిశుధ్యానికే ప్రథమ ప్రాధాన్యం

 పారిశుధ్యానికే ప్రథమ ప్రాధాన్యం

పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి

పటాన్‌చెరు: అభివృద్ధ్ది పనులపై రాజీ పడేది లేదని పారి శుధ్యానికే ప్రథమ ప్రాధాన్యత అని పటాన్‌చెరు ఎమ్మెల్యే  మహిపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్‌చెరులో ఎంపీ పీ సమావేశ మందిరంలో ఎంపీపీ సుష్మశ్రీ ఆధ్వర్యంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ పటాన్‌చెరు మండలం అభివృద్ధి పథంలో ముందున్నదన్నారు. కొవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌తో కొన్ని పనులు నిలిచిపోయినా ఇప్పుడు జరుగుతున్నాయన్నారు. కరోనా వైరస్‌పై అధికారులు పోరాడుతున్నారన్నారు. పారిశుధ్యం విషయంలో 24గంటలు అప్రమత్తంగా ఉందన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులకు సర్పంచ్‌లు, కార్యదర్శులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతులకోసం రూ. 12లక్షల విలువైన 113 క్వింటాళ్ల కంది విత్తనాలను కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ఎంపీపీ మాట్లాడుతూ పటాన్‌చెరు మండలంలోని పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. అధికారులు, ఎంపీటీసీలు ప్ర జాసమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరారు.  జడ్పీటీసీ సుప్రజ వెంకట్‌రెడ్డి, ఎండీడీవో బన్సీలాల్‌, తహసీల్దార్‌ మహిపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు

 పల్లె ప్రకృతి వనం ఏర్పాటు 

సంగారెడ్డి టౌన్‌ : ఉపాధి హామీ పథకం కింద రెండు ఎకరాలు ఉన్న రైతుల భూముల్లో నూతనంగా పల్లె ప్రకృతి వనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారి గీతాదేవి తెలిపారు.  సదాశివపేటలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ యాదమ్మ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ, ఆరోగ్య, విద్యుత్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, ఐసీడీఎస్‌, పశుసంవర్ధ్దకశాఖ, ఉపాధిహామీ, పంచాయతీరాజ్‌ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌తో  రెండుఎకరాలు ఉన్న వారికి కలెక్టర్‌  ఆదేశాలతో పల్లె ప్రకృతి వనం పేరుతో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నామని అధికారి గీతాదేవి తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఉపాధిహామీ అధికారులను సంప్రదించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారి అనితారెడ్డి మాట్లాడుతూ ఆరుఎకరాల లోపు రైతులకు రైతుబంధు  జమ చేయడం జరిగిందన్నారు. ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేదని, రైతులు  యూరి యా,  20-20 మందులను ఇంటిలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం పచ్చిరొట్ట, జీలుగ విత్తనాలను సబ్సిడీపై అందిస్తుందన్నారు. అనంతరం ఐసీడీఎస్‌, పశుసంవర్ధ్దక, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో పూజ, సొసైటీ చైర్మన్‌ రత్నాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు మాధవరెడ్డి, సత్యనారాయణ, మమత, సర్పంచ్‌లు శ్రీవాణి, భూపాల్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంఈవో అంజయ్య, మధుకర్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. logo