శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sangareddy - Jun 13, 2020 , 00:26:51

వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

కలెక్టర్‌ హనుమంతరావు

సంగారెడ్డి టౌన్‌  : జిల్లాలో వైకుంఠ ధామాలను యుద్ధ్ద ప్రాతిపదికన ఈనెల 30లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ హనుమంతరావు అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్‌ అధికారులతో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలు, వైకుంఠధామాల నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.   నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మాజీకి సూచించారు.   సమీక్షలో పంచాయతీరాజ్‌ ఈఈ దామోదర్‌, డీఈ లు, ఏఈలు పాల్గొన్నారు. 

డంపు యార్డులను వినియోగంలోకి తేవాలి..

ప్రతి డంపు యార్డులను వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్‌ సూచించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 10 మండలాలకు చెందిన 100గ్రామ పం చాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం, డంపు యార్డుకు తరలించడం, కంపోస్టు తయారీ అంశాలపై అవగాహన కల్పించారు.