సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jun 12, 2020 , 01:41:09

వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డుల అందజేత

వీధి వ్యాపారులకు గుర్తింపుకార్డుల అందజేత

వట్‌పల్లి : అందోల్‌- జోగిపేట మున్సిపాలిటీలోని 399 మంది వీధి వ్యాపారులను గుర్తించి వారికి గుర్తింపుకార్డులతోపాటు వెండింగ్‌ సర్టిఫికెట్లను అందజేశామని మున్సిపల్‌ చైర్మన్‌ మల్లయ్య అన్నారు. గురువారం జోగిపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీధి వ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశ పట్టిన ‘ఆత్మ నిర్బర్‌ భారత్‌' పథకం కింద బ్యాంక్‌ల ద్వారా ఒకొక్కక్కరికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని, ఈ అవకాశాన్ని వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మిర్జాఫసహాత్‌ అలీబేగ్‌, వైస్‌ చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌, కౌన్సిలర్‌ దుర్గేశ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ ప్రెసిడెంట్‌ రవీంద్రగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


logo