గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 12, 2020 , 01:37:17

పులకరించిన రైతులు

పులకరించిన రైతులు

పలకరించిన తొలకరి..

పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం

ప్రారంభమైన వ్యవసాయ పనులు

 కూలీలకు చేతినిండా పని

రాయికోడ్‌ : తొలకరి వర్షం కురువడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. బుధవారం రాత్రి కురిసిన వర్షంతో రైతులు దుక్కిదున్ని పంట సాగుకు సిద్ధమయ్యారు. తొలకరి వర్షాలు కురవడంతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. మృగశిర కార్తెలో విత్తనాలు వేస్తే పంటలకు తెగుళ్లు, చీడపీడల బారిన పడకుండా అధిక దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో 15,500 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తున్నట్టు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. 

పొలం పనుల్లో రైతన్నలు 

వట్‌పల్లి : రెండు రోజులుగా అందోల్‌, వట్‌పల్లి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురువారం ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు విత్తనాలు వేయని రైతులు నేటి నుంచి విత్తనాలు వేసేందుకు సిద్ధమయ్యారు. 


logo