మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - Jun 12, 2020 , 01:31:55

రైతాంగానికి పెద్దపీట

రైతాంగానికి పెద్దపీట

  • n ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
  • n వెలిమెల, లక్డారం గ్రామాల్లో రైతులకు ఉచితంగా కంది విత్తనాల పంపిణీ

రామచంద్రాపురం: ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల గ్రామంలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో రైతులకు కంది విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో వ్యవసాయం పండుగలా మారిందని అన్నారు. కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరానికి నీరంది స్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు రాజులాగా బతికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగుచేయాలని సూచించారు. తెల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని రైతులకు 8 క్వింటాళ్ల కంది విత్తనాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లలితాసోమిరెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారిక, వైస్‌ చైర్మన్‌ మల్లారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్‌ కుమార్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు శ్రీశైలంయాదవ్‌, సుచరిత, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

లక్డారంలో..

పటాన్‌చెరు: లక్డారం రైతులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన సొంత నిధులతో కంది విత్తనాలు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. అదేవిధంగా రూ.85 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో బీటీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.31లక్షల విలువైన బర్రెలు, ఆవులు, మేకలు, బోరుమోటర్లు, పైపులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో పంచాయతీరాజ్‌ విభాగం ద్వారా లక్డారం, బేగంపేట గ్రామాల మధ్య వంతెనను నిర్మించనున్నట్లు తెలిపారు. రూ.15లక్షల సబ్సిడీతో పాడి పశువుల అవసరాల కోసం బోరు మోటర్లు అందజేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీ సుష్మశ్రీ, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ హారిక, ఆత్మ కమిటీ చైర్మన్‌ గడీల కుమార్‌గౌడ్‌, సర్పంచ్‌ సువర్ణ, రైతు బంధు సమితి కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రుద్రారం పీఏసీఎస్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు సురేశ్‌, ఉష, మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.


logo