బుధవారం 05 ఆగస్టు 2020
Sangareddy - Jun 11, 2020 , 02:57:06

అప్పాజిపల్లి తండాలో ఫుడ్‌ పాయిజన్‌

అప్పాజిపల్లి తండాలో ఫుడ్‌ పాయిజన్‌

20 మందికి అస్వస్థత.. జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలింపు

అల్లాదుర్గం : తండాలో జరిగిన వేడుకల సందర్భంగా ఫుడ్‌ పాయిజన్‌తో 20మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని అప్పాజిపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. తండావాసుల కథనం ప్రకారం.. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం దసరా వేడుకలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా మంగళవారం రాత్రి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తండాలోని పర్త్య బాబునాయక్‌ ఇంటికి బంధువులు వచ్చి విందు ఆరగించారు. ఈ క్రమంలోనే వాంతులు, విరోచనాలయ్యాయి. బుధవారం ఉదయం కూడా మరికొంతమంది వృద్ధులు, చిన్నారులు కూడా అస్వస్థతకు లోనుకావడంతో ఆటోలో అల్లాదుర్గం ప్రభుత్వ దవాఖానాకు చేరుకున్నారు. 108 వాహనంలో హరీశ్‌(5), సౌజన్య(8), హరిచంద్ర(7), దానాబాయి(55), చందు(25), కింగ్యానాయక్‌(75)లను చికిత్స కోసం జోగిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. మరికొందరిని పలు ప్రైవేటు దవాఖానాలకు తీసుకెళ్లారు.


logo