బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jun 11, 2020 , 00:03:43

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌

దుబ్బాక టౌన్‌ : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టితో పని చేస్తున్నట్లు సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ఖాన్‌ అన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మిషన్‌భగీరథ, విద్యుత్‌శాఖ అధికారులతో అదనపు కలెక్టర్‌ సమీక్షించారు. గత నెలలో జరిగిన మున్సిపల్‌ పాలకవర్గ సమావేశంలో తలెత్తిన సమస్యలను సమీక్షించి పరిష్కరించాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరగా నేడు సమావేశం నిర్వహించారు. తాగునీటిని దుర్వినియోగం చేస్తున్నవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అదనపు కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అవసరమున్న చోట కొత్త ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదించాలన్నారు. ప్రమాదకరంగా ఉన్న స్తంభాలను తొలగించి, కొత్తవాటిని వేయాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గన్నె వనిత, భగీరథ డీఈ విక్రంగౌడ్‌, ఏఈ రోహిత్‌, విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గోల్కొండ నర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నుల వసూలులో దుబ్బాక మున్సిపాలిటీ ముందుండటంపై సిబ్బందిని అభినందించారు. logo