బుధవారం 21 అక్టోబర్ 2020
Sangareddy - Jun 10, 2020 , 04:03:48

కొత్త కొత్తగా..!

కొత్త కొత్తగా..!

n సంగారెడ్డిలో 10,500 చదరపు అడుగుల్లో అన్ని హంగులతో జడ్పీ భవనం సిద్ధం

n విశాలమైన సమావేశ మందిరం, చాంబర్లు

n రూ.5 కోట్లతో పనులు చేపట్టిన ప్రభుత్వం

n నేడు ప్రారంభించనున్న మంత్రి హరీశ్‌రావు 

l అధునాతన హంగులతో జడ్పీ భవనం సిద్ధం

l నేడు ప్రారంభించనున్న  మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : అధునాతన హంగులతో సంగారెడ్డి జిల్లా పరిషత్‌ భవన సముదాయం ముస్తాబైంది. బుధవారం మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 10,500చదరపు అడుగుల్లో విశాలమైన చాంబర్లు, సమావేశ మం దిరం, కార్యాలయ సిబ్బంది గదులను నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 5,250 చదరపు అడుగుల సమావేశ మందిరం, డైనింగ్‌ హాల్‌, వీఐపీ రెస్ట్‌రూంలను ఏర్పాటు చేశారు. మొదటి అంతస్తులోని 5,250 చదరపు అడుగుల్లో జడ్పీ చైర్‌ పర్సన్‌ చాంబర్‌, సీఈవో, డిప్యూటీ సీఈవో చాంబర్లు, మినీ సమావేశ మం దిరంతో పాటు జడ్పీ ఉద్యోగుల కార్యాలయ గదులు ఉన్నాయి. గతంలో ఉమ్మ డి జిల్లా జడ్పీ సమావేశ మందిరం చిన్నదిగా ఉండడంతో నూతన భవన నిర్మాణానికి అప్పట్లో ప్రభుత్వం రూ. 5కోట్ల నిధులు విడుదల చేయగా, 2016లో శంకుస్థాపన చేశారు. ఈక్రమంలో 20 18లో జిల్లాల విభజన కావడంతో భవనాన్ని సంగారెడ్డి జిల్లాకు కేటాయించారు. నూతన కార్యాలయంలో బుధవారం జడ్పీ సాధారణ సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మం త్రి హరీశ్‌రావు భవనాన్ని ప్రారంభించిన తర్వాత సమావేశం జరుగనుంది. అనంతరం మంత్రి సమక్షంలో సీడీసీ చైర్మన్‌, సదాశివపేట మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించనున్నారు. logo