మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jun 10, 2020 , 00:28:57

వలస కార్మికులు హోం క్వారంటైన్‌

వలస కార్మికులు హోం క్వారంటైన్‌

n తూప్రాన్‌లో ఇంటింటికీ సర్వే

n వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేసిన మున్సిపల్‌ సిబ్బంది

నంగునూరు/చిన్నశంకరంపేట/తూప్రాన్‌ రూరల్‌: ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వలస కూలీలు హోం క్వారంటైన్‌లో ఉండాలని రాజగోపాల్‌పేట ఎస్సై అశోక్‌ సూచించారు. ఉత్తరప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 10మంది వలస కార్మికులు గట్లమల్యాల గ్రామానికి వచ్చారు. మంగళవారం వైద్యాధికారి రాధిక వారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి 28 రోజులపాటు అక్కడే ఉండాలని సూచించారు. రాంపూర్‌ గ్రామానికి తిరుపతి నుంచి వచ్చిన ఓ కుటుంబానికి కౌన్సెలింగ్‌ నిర్వహించి హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. చిన్నశంకరంపేట మండలంలోని కామారం గిరిజన తండాకు విజయవాడ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. విషయం తెలుసుకున్న మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రావణి, వైద్య సిబ్బంది వారిని 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు పంపించారు. తూప్రాన్‌ పట్టణంలో పారిశుధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో మున్సిపల్‌ పాలకవర్గం చర్యలు చేపట్టింది. మున్సిపల్‌ చైర్మన్‌ రాఘవేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో కాలనీలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. తూప్రాన్‌ పీహెచ్‌సీ డాక్టర్‌ భావన ఆధ్వర్యం లో వైద్య సిబ్బంది 1,2,3,4 వార్డుల్లో సర్వే నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ దగ్గు, జ్వరం, ఛాతినొప్పి, జలుబుతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, పీహెచ్‌ఎన్‌ సంపతి, ఏఎన్‌ఎంలు విజయ, నాగమణి, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

మెదక్‌లో మరో పాజిటివ్‌ కేసు 

మెదక్‌ : జిల్లాలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా మెదక్‌ పట్టణంలో ఓ వ్యక్తికి కరోనా  పాజిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు పేర్కొ న్నారు.. దీంతో ఆ వ్యక్తి  నివాస ప్రాంతాన్ని కంటైన్మెంట్‌ ప్రాంతంగా ప్రకటించి రాకపోకలు లేకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో మెదక్‌ పట్టణంలో నలుగురికి, పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లిలో ఒకరికి, కొడపాకలో ఒకరికి, చేగుంటలో నలుగురికి కరోనా వైరస్‌ సోకగా, సోమవారం తూప్రాన్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో జిల్లాలో మొత్తం 12 మందికి పాజిటివ్‌ వచ్చిందని, ఆరుగురికి నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో తెలిపారు. చేగుంటకు చెందిన నలుగురు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారని, తూప్రాన్‌కు చెందిన వ్యక్తి కూడా ఇంట్లోనే చికిత్స పొందుతున్నాడని పేర్కొన్నారు. అయితే మెదక్‌ పట్టణానికి చెందిన వ్యక్తి గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.  


logo