శనివారం 15 ఆగస్టు 2020
Sangareddy - Jun 09, 2020 , 03:08:05

ఎస్సెస్సీ విద్యార్థుల ప్రమోట్‌

ఎస్సెస్సీ విద్యార్థుల ప్రమోట్‌

n కరోనా తీవ్రత  నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

n ఉమ్మడి జిల్లాలో 48,256 మంది  విద్యార్థులు

n ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా గ్రేడ్లు 

సంగారెడ్డి టౌన్‌/మెదక్‌/సిద్దిపేట :  రాష్ట్రంలో కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని రద్దు చేసింది. పరీక్షలు రాయకుండానే ఎస్సెస్సీ విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ విద్యాశాఖను ఆదేశించారు. ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా విద్యార్థులను ప్రమోట్‌ చేయనునున్నారు. వాటి ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 48,256 మంది ఎస్సెస్సీ విద్యార్థులు ప్రమోట్‌ కానున్నారు.logo