గురువారం 22 అక్టోబర్ 2020
Sangareddy - Jun 09, 2020 , 01:02:38

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

n హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌

n కోహెడ ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

కోహెడ : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కోహెడ మా ర్కెట్‌ కమిటీ కార్యాలయ ఆవరణలో ఏఎంసీ నూ తన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. దీనికి జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మతో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఏఎంసీ చై ర్‌పర్సన్‌ ఆవుల రాధమ్మ, పాలకవర్గ సభ్యులను శాలువా, పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కాళేశ్వరం నుంచి కొండపోచమ్మ వరకు ప్రాజెక్టులు నిర్మించిన ఘ నత కే సీఆర్‌దేనన్నారు. త్వరలో గోదావరి జలా లు హుస్నాబాద్‌ నియోజకవర్గానికి చేరుకుంటాయన్నారు. గౌరవెల్లిగండిపెల్లి రిజర్వాయర్లపై కొందరు విమర్శలు చేయడం వారి అవగాహన లే మికి నిదర్శమన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో రంగనాయక సాగర్‌, గౌరవెల్లిగండిపెల్లి, ధర్మసాగర్‌, రిజర్వాయర్ల ద్వారా నియోజకవర్గం లో 1 లక్షా 63 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నదన్నారు. నియోజకవర్గంలో 13చెక్‌డ్యాంలు నూతనంగా మంజూరయ్యాయని ఇందులో కోహెడ మండలానికి ఆరు ఉన్నాయన్నారు. జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే అదే బంగారు తెలంగాణ అని అన్నారు. నియంత్రిత వ్యవసాయం చేసి ముఖ్యమంత్రికి సహకరించాలని ఆమె కోరారు. మార్కెట్‌లో అమ్ముడుపోయే పంట ధాన్యాలను పండించేందుకు రైతులు ముందుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ కొక్కుల కీర్తి, జడ్పీటీసీ నాగరాజు శ్యామల, ప్యాక్స్‌ చైర్మన్‌ పేర్యాల దేవేందర్‌రావు, హుస్నాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ తిరుపతిరెడ్డి, వైస్‌ ఎంపీపీ తడకల రాజిరెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.logo