మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Jun 09, 2020 , 01:01:03

ఆలయ దర్శనం.. భక్తుల పరవశం

ఆలయ దర్శనం.. భక్తుల పరవశం

చేర్యాల/ పాపన్నపేట/  వర్గల్‌/  ఝరాసంగం/ మెదక్‌ రూరల్‌ /పటాన్‌చెరు /మెదక్‌టౌన్‌ / అమీన్‌పూర్‌/ హుస్నాబాద్‌ :  కొమురవెల్లి పుణ్యక్షేత్రం సోమవారం తెరుచుకోవడంతో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయవర్గాలు వెల్లడించాయి. ఏడుపాయల వనదుర్గాభవానీమాత సోమవారం భక్తులకు దర్శనమిచ్చింది. ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్‌ స్టాండ్‌ ఏర్పాటు చేసి భక్తులు చేతులు శుభ్రం చేయించి, థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసి ఆలయంలోకి అనుమతి ఇస్తున్నారు. వర్గల్‌ విద్యాధరి సరస్వతీ, నాచగిరి లక్ష్మీనృసింహ్మ స్వామి ఆలయాల్లో ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు దేవతామూర్తులను దర్శించుకున్నారు. ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది శానిటైజర్‌ వేసి దర్శనానికి అనుమతినిచ్చారు. రుద్రారం పరిధిలోని గణేశ్‌ దేవాలయం, అమీన్‌పూర్‌ మున్సిపల్‌ పరిధిలోని బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. మెదక్‌ సీఎస్‌ఐ చర్చిలో సోమవారం ఉదయం 6గంటలకు ప్రథమ గురువు అండ్రూస్‌ ప్రేమ్స్‌సుకుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ భక్తులు లోపలికి ప్రవేశించక ముందే థర్మల్‌ స్క్రీనింగ్‌  చేసి లోనికి అనుమతించామన్నారు. 


logo