సోమవారం 03 ఆగస్టు 2020
Sangareddy - Jun 08, 2020 , 00:26:26

నారాయణఖేడ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

నారాయణఖేడ్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

నారాయణఖేడ్‌ : ఖేడ్‌ పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి తెలిపారు. ఆదివారం నారాయణఖేడ్‌ పట్టణంలోని 14వ వార్డులో రూ.15 లక్షలతో ఏర్పాటు చేసిన ఇంటింటికీ నల్లాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మున్సిపాలిటీగా మార్చామన్నారు. రూ.15 కోట్ల నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సత్వరమే పూర్తి చేసి పట్టణంలో సమస్యలు లేకుండా చూస్తానన్నారు. 14వ వార్డు కౌన్సిలర్‌ నూర్జహన్‌ అబెదాబేగం తన వార్డులో నీటి సమస్యను శాశ్వతంగా తీర్చే దిశగా వేగవంతంగా నల్లాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పట్టణంలో మంచి నీటి వసతితోపాటు మురుగు కాల్వల శుభ్రం, వీధి లైట్ల ఏర్పాటుపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నారాయణఖేడ్‌ పట్టణంలో చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ రుబీనాబేగం నజీబ్‌, వైస్‌ చైర్మన్‌ పరశురాం, మాజీ ఎంపీటీసీ సయ్యద్‌ ముజామిల్‌, మున్సిపల్‌ కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo