ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 08, 2020 , 00:10:53

‘ప్రతి ఇంటిని శానిటైజ్‌ చేస్తాం’

‘ప్రతి ఇంటిని శానిటైజ్‌ చేస్తాం’

రామాయంపేట: మున్సిపల్‌ పరిధిలోని ప్రతి ఇంటిని శానిటైజ్‌ చేస్తామని రామాయంపేట మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం పట్టణప్రగతిలో భాగంగా మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకే 10గంటల 10 నిమిషాలకు పారిశుధ్య కార్మికులకు శానిటైజ్‌ బా క్సులను అందజేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం చైర్మన్‌ జితేందర్‌గౌడ్‌, వార్డు సభ్యులు దేమె యాదగిరి తమ ఇండ్లలోని ట్యాంక్‌లు, పూలకుండీలు, పరిసర ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఉన్నారు.

ఇంటి పరిసరాల శుభ్రం

తూప్రాన్‌ రూరల్‌: ఇండ్లు, పరిసరాలను పరిశుభ్రం చేసుకుంటేనే సీజనల్‌ వ్యాధులు రావని తూప్రాన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌ పట్టణ ప్రజలకు సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు చైర్మన్‌తో పాటు కమిషనర్‌ ఖాజామొజియొద్దీన్‌, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు ప్రజలు తమ ఇండ్లు, పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ..మంత్రి కేటీఆర్‌ ఆదేశాలను పాటించి అనారోగ్యానికి గురికాకుండా ప్రజలు జాగ్రత్త పడాలన్నారు.

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

నిజాంపేట: తమ చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిజాంపేట ఎంపీపీ దేశెట్టి సిద్ధిరాములు అన్నారు. ఆదివారం 10గంటల 10 నిమిషాలకు తన స్వగృహంలో నీటి తొట్టిలోని నీళ్లను, ఇంటి పరిసర ప్రాంతాల్లోని చెత్తను తొలగించారు.


logo