మంగళవారం 20 అక్టోబర్ 2020
Sangareddy - Jun 07, 2020 , 00:10:51

మండుటెండలో నిండుకుండలా..

మండుటెండలో నిండుకుండలా..

గోదారమ్మ జలాలతో నిండిన గొలుసుకట్టు చెరువులు 

రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ ద్వారా మండల పరిధిలోని గుర్రాలగొంది గ్రామానికి గోదావరి జలాలు రావడంతో గ్రామంలోని పెద్దరాయిని, చిన్నరాయిని  గొలుసుకట్టు చెరువులు  నిండుకుండను తలపిస్తున్నాయి. 30 రోజుల నుంచి గుర్రాలగొంది గ్రామానికి గోదావరి జలాలు చేరుకుంటున్నాయి.  ఈ చెరువుల ద్వారా సుమారు 435 ఎకరాలు సాగులోకి రానున్నాయి. మరికొద్ది రోజుల్లో చెరువులు మత్తడి పారనున్నది. దీంతో  రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు,సర్పంచ్‌ ఆంజనేయులు, ఎంపీటీసీ హరీశ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. 

-నారాయణరావుపేట 


logo