శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Sangareddy - Jun 05, 2020 , 23:51:05

నిరుపేదలకు ‘కల్యాణలక్ష్మి’ వరం

నిరుపేదలకు ‘కల్యాణలక్ష్మి’ వరం

ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి 

నారాయణఖేడ్‌ : నిరుపేదలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తుర్కపల్లి తండాకు చెందిన పలువురికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను నారాయణఖేడ్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, బంజారా సేవాలాల్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్‌ చౌహాన్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

పత్తి మిల్లును సందర్శించిన ఎమ్మెల్యే

నారాయణఖేడ్‌ : మండలం పరిధిలోని సత్యగామ శివారు శ్రీలక్ష్మి పత్తి మిల్లులో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి శుక్రవారం పత్తి మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా సీసీఐ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ విజయ్‌కుమార్‌తో ఎమ్మెల్యే చర్చించి మిల్లు యజమానికి సహకరించాల్సిందిగా సూచించారు. అగ్నిప్రమాదంలో దగ్ధమైన పత్తికి సంబంధించి మార్కెటింగ్‌ డీఎం నరేందర్‌తో మాట్లాడారు. దాదాపు 300 క్వింటాళ్ల పత్తి దగ్ధమైనట్లు అంచనా వేస్తున్నామని డీఎం తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. 


logo