శుక్రవారం 07 ఆగస్టు 2020
Sangareddy - Jun 05, 2020 , 00:01:17

రూ.కోటి ఎనభై లక్షల పరిహారం చెక్కులు అందజేత

రూ.కోటి ఎనభై లక్షల పరిహారం చెక్కులు అందజేత

రాయిలాపూర్‌లో భూములు కోల్పోయిన

60 మంది రైతులకు అందజేసిన ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి

రామాయంపేట : కాళేశ్వరం కాలువలతో అన్నదాతల కండ్లలో ఆనందం కనిపిస్తున్నదని ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి అన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్‌ గ్రామంలో కాలువలతో భూములను కోల్పోయిన రైతులకు గురువారం పరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రాయిలాపూర్‌ గ్రామంలో కాళేశ్వరం కాలువ నిర్మాణంలో 60 మంది రైతులు తమ భూములను కోల్పోయారని, వారందరికీ ప్రభుత్వం రూ.కోటి 80 లక్షల పరిహారం చెక్కులను అందజేసిందన్నారు. కాలువల ద్వారా చెరువులు నిండుతాయన్నారు. అన్నదాతలకు చేయూతనందించడమే ప్రభుత్వ లక్ష్యమని, వానాకాలంలో పంటలను వేసుకునే రైతులకు సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు సిద్ధ్దంగా ఉన్నాయన్నారు. రైతులు నియంత్రిత పంటలనే వేసుకొని అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఈసారి ఎక్కువ శాతం రైతులు సన్నరకం, వరి పంటతో పాటు పత్తి, జొన్న, సజ్జ ఇతర పంటలనే విత్తుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ సంధ్య,గ్రామ సర్పంచ్‌ భూమగారి నర్సగౌడ్‌, ఎంపీటీసీ సార్గు భాగ్యమ్మ భిక్షపతి, తహసీల్దార్‌ శేఖర్‌రెడ్డి, ఎంఆర్‌ఐ. సత్యనారాయణ, నాగరాజు, వీఆర్‌వో ప్రభాకర్‌, సార్గు సత్య నారాయణ, ప్రశాంత్‌ తదితరులున్నారు.


logo