సోమవారం 06 జూలై 2020
Sangareddy - Jun 04, 2020 , 23:59:23

నర్సరీల్లో అన్నిరకాల మొక్కలు పెంచాలి

నర్సరీల్లో అన్నిరకాల మొక్కలు పెంచాలి

మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి 

 హవేళిఘనపూర్‌ :  నర్సరీల్లో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మొక్కలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒకే రకమైన మొక్కలు పెంచడం పట్ల  కలెక్టర్‌ ధర్మారెడ్డి పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని ముత్తాయికోట, ఫరీద్‌పూర్‌, బూర్గుపల్లి గ్రామాలతో పాటు పంచాయతీ పరిధిలో ఉన్న నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఫరీద్‌పూర్‌ గ్రామంలో ప్రజలు కోరిన అన్ని రకాల మొక్కలను పెంచాల్సి ఉండగా, కేవలం ఒకే రకమైన మొక్కలు పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిర్లక్ష్యం వహించిన గ్రామ సర్పంచ్‌,  పంచాయతీ సెక్రటరీలకు నోటీసులు ఇవ్వాలని జిల్లా పంచాయతీ అధికారి హనుక్‌ను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు కూడా పరిశుభ్రత పాటిస్తూ అధికారులకు, ప్రజాప్రతినిధులకు సహకరించాలని ఆయన కోరారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి హనుక్‌, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, ఎంపీడీవో సాయిబాబా, గ్రామ సర్పంచ్‌ అనురాధ తదితరులు ఉన్నారు. logo