బుధవారం 15 జూలై 2020
Sangareddy - Jun 04, 2020 , 23:53:58

మినీ ట్యాంక్‌బండ్‌గా ‘రాయసముద్రం’

మినీ ట్యాంక్‌బండ్‌గా  ‘రాయసముద్రం’

ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

చెరువు సుందరీకరణ పనులు పరిశీలన

రామచంద్రాపురం : రాయసముద్రం చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి పరుస్తామని ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పాతరామచంద్రాపురంలో ఉన్న రాయసము ద్రం చెరువును కార్పొరేటర్‌ అంజయ్యయాదవ్‌తో వారు పరిశీలించి.  అనంతరం చెరువు అభివృద్ధిపై ఇరిగేషన్‌ అధికారులతో సమీక్షించారు. చెరువు అభివృద్ధికి ప్రభుత్వం రూ.6.8కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పనులపై ఆరా తీశారు. పూడికతీత పనులతో పాటు గుర్రపుడెక్కను తొలిగించాలని ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయసముద్రం చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. వారివెంట గ్రంథాలయ డైరెక్టర్‌ కుమార్‌గౌడ్‌, ఆదర్శ్‌రెడ్డి, పరమేశ్‌యాదవ్‌, రాజిరెడ్డి, బేకుయాదయ్య, ఇరిగేషన్‌ అధికారులు ఉన్నారు.

చెరవులను పరిశీలించిన ఎమ్మెల్యే  

అమీన్‌పూర్‌ : సీఎం కేసీఆర్‌ చెరువులు, కుంటల అభివృద్ధికి నిరంతరం కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న చెరువులు, కుంటల సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షకాలం సమీపిస్తుండటంతో పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే  వెంట ఎంపీపీ దేవానంద్‌, జడ్పీటీసీ  సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

అంగన్‌వాడీలకు నిత్యావసర సరుకులు పంపిణీ

పటాన్‌చెరు: కరోనా నియంత్రణలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంల సేవలు భేష్‌ అని ఎమ్మెల్యే  మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని జీఎమ్మార్‌ కన్వెన్షన్‌ హాల్‌లో అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లకు నిత్యావసర సరుకులు, మాస్క్‌లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌ మండలాల్లో సేవలందిస్తున్న 335 మందికి కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో కరోనా నేపథ్యంలో వారు చేస్తున్న సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు సుప్రజ వెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంపీపీలు సుష్మశ్రీరెడ్డి, ఈర్ల దేవానంద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు ఆదర్శ్‌రెడ్డి, కార్పొరేటర్‌  అంజయ్యయాదవ్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ హారిక, విజయ్‌కుమార్‌, దశరథరెడ్డి పాల్గొన్నారు.

నేడు అభివృద్ధి పనులకు శంకుస్థాపన  

జిన్నారం/గుమ్మడిదల: జిన్నారం, గుమ్మడి మండలాల్లో  శుక్రవారం ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని జడ్పీ వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజేశ్‌, సర్పంచ్‌ వాసవి దామోదర్‌రెడ్డి  వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. కొడకంచి పంచాయతీలో రూ.6 లక్షలతో నిర్మించే అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, పుట్టగూడలో రూ.5లక్షతో నిర్మించే అంగన్‌వాడీ భవన నిర్మాణం, రాంరెడ్డిబావిలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని వారు పేర్కొన్నారు. 


logo