శుక్రవారం 14 ఆగస్టు 2020
Sangareddy - Jun 04, 2020 , 23:34:02

రైతుసేవకే అంకితం

రైతుసేవకే అంకితం

సీఎం కేసీఆర్‌ అడుగు జాడల్లో పనిచేస్తా

నన్ను ఆదరించిన వారందరికీ కృతజ్ఞతలు

గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాస్‌ అన్నపూర్ణ శ్రీనివాస్‌

గజ్వేల్‌, నమస్తే తెలంగాణ : ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేసేవారిని సీఎం కేసీఆర్‌ గుర్తిస్తారని, తనపై నమ్మకంతో పదవిని కట్టబెట్టినందుకు రైతు సేవకే అంకితమవుతానని నూతనంగా నియామకమైన గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్‌ అన్నారు. గురువారం గజ్వేల్‌ క్యాంప్‌ ఆఫీస్‌లో  మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్‌సీ రాజమౌళి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఆదేశాల మేరకు శక్తివంచనలేకుండా కృషి చేస్తానన్నారు. రైతుల కష్టాలను తమ కష్టాలుగా భావించి పని చేస్తానన్నారు. గజ్వేల్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ నియామకానికి సహకరించిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లుతో పాటు పలువురికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మార్కెట్‌ కమిటీ సభ్యులను శాలువాతో సత్కరించారు. సమావేశంలో ఎంపీపీ అమరావతి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశంగౌడ్‌, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కృష్ణ, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, నాయకులు జాకి, బెండ మధు, గోపాల్‌రెడ్డి, రవీందర్‌రావు, నర్సింగ్‌, నాగులు, ఉపేందర్‌రెడ్డి, గుండా రంగారెడ్డి పాల్గొన్నారు.  logo