బుధవారం 12 ఆగస్టు 2020
Sangareddy - Jun 04, 2020 , 00:14:06

శతమానంభవతి

శతమానంభవతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు

సేవా కార్యక్రమాలు.. ప్రార్థనలు, ప్రత్యేక పూజలు

ఉమ్మడి మెదక్‌ నెట్‌వర్క్‌ : ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అభిమానులు బుధవారం ఘనంగా నిర్వహిం చారు. 48వ పుట్టిన రోజు కావడంతో 48 కిలో ల కేక్‌ ను కట్‌చేసి పంచారు. ఆలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గజ్వే ల్‌ దవాఖానలో 48మంది రక్తదానం చేశారు. రోగులకు పండ్లు, బ్రెడ్లు అందించారు. కొందరు మెక్కలను నాటగా, మరి కొందరు పలు రకాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గజ్వేల్‌ హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో మెద క్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్సీ రాజమౌళి 48కిలోల కేక్‌ కట్‌ చేశారు. గజ్వేల్‌ ఐవోసీ భవనం లో 48మంది క్యాన్సర్‌, పక్షవాత రోగులకు రూ.5వేల చొప్పున సాయం అందజేశారు. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లోని రంగనాయకసాగర్‌ కట్టపై జ డ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ చిన్నకోడూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు కేక్‌ కట్‌ చేశారు. మంత్రి హరీశ్‌రావు దత్తత గ్రామం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఇంటికో మొక్క చొప్పున 300మొక్కలు నాటి, తమ అభిమాన నేతకు బహుమానం ఇచ్చారు. అందోల్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ క్రాంతి కేక్‌ కట్‌, పంచిపెట్టారు. చిలిపిచెడ్‌ మండల కేంద్రంలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి, పంచిపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, యువకులు రక్తదానం చేశారు. సంగారెడ్డి మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మున్సిప ల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మిరవి ఆధ్వ ర్యంలో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీజైపాల్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఆస్ట్రేలియాలో ఉన్న 150 మంది మనదేశ విద్యార్థులకు ఇండియన్‌ స్టూ డెంట్స్‌ అసోసియేషన్‌ విక్టోరియా అధ్యాపకుడు సాయిప్రణీత్‌రెడ్డి నిత్యావసర సరుకులను పం పిణీ చేశాడు. తన అభిమాన నేత జన్మదిన సం దర్భంగా సరుకులు పంపిణీ చేయడం ఆనం దంగా ఉందని సాయిప్రణీత్‌రెడ్డి తెలిపాడు. సిద్దిపేట ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో లాల్‌ కమాన్‌ వద్ద 500 మందికి పులిహోర పంపిణీ చేశారు. చింతమడక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రక్తదాన శిబిరం నిర్వహించారు. సిద్దిపేట లోని మంత్రి నివాసంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, ఏఎంసీ చైర్మన్‌ పాల సాయిరాం, కేకు కట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌ రోడ్‌లో 48 మొక్కలు నాటారు. 


logo