ఆదివారం 09 ఆగస్టు 2020
Sangareddy - Jun 04, 2020 , 00:10:02

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

‘కల్యాణలక్ష్మి’ పేదలకు వరం

‘కల్యాణలక్ష్మి’ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్‌

రేగోడ్‌ : ‘కల్యాణలక్ష్మి’ పథకం పేదలకు వరమని ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రం రేగోడ్‌లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొస్తున్నారన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో ఎంతో మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌ను కట్‌ చేశారు. రేషన్‌ కార్డులు లేని వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎస్సై కాశీనాథ్‌, ఎంఆర్‌ఐ శ్యాంరావు, జడ్పీటీసీ యాదగిరి, ఎంపీపీ సరోజన, ఎంపీవో లచ్చాలు, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజుయాదవ్‌, జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడు రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్‌, సర్పంచులు నర్సింహులు, తుకారం, సుమంత, రవీందర్‌, ఎంపీటీసీ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.   

నర్సాపూర్‌లో.. 

నర్సాపూర్‌ రూరల్‌ : కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు ఎంతో ఆసరా అవుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్‌ పట్టణంలోని మణికొండ ఫంక్షన్‌ హాల్‌లో అదనపు కలెక్టర్‌ నగేశ్‌తో కలిసి ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సాపూర్‌ మండలంలో 62, హత్నూరా మండలంలో 24 మంది లబ్దిదారులకు చెక్కులను అందజేశామని తెలిపారు. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్‌, ప్రజా సంక్షేమానికి కొండంత అండగా నిలుస్తున్నారన్నారు. సంవత్సరంలోపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నియోజకవర్గానికి నీళ్లు వస్తాయన్నారు.   

మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలు

నర్సాపూర్‌ పట్టణంలోని మణికొండ ఫంక్షన్‌ హాల్‌లో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పుట్టిన రోజు వేడుకలను  ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ కేక్‌ కట్‌ చేసి మంత్రి హరీశ్‌రావుకు  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్‌ మాలతి, ఎంపీడీవో మార్టిన్‌ లూథర్‌,  జిల్లా గ్రంథాలయచైర్మన్‌ చంద్రాగౌడ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నయూం, ఎంపీపీ జ్యోతిసురేశ్‌ నాయక్‌, కౌన్సిలర్‌ అశోక్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo