మంగళవారం 11 ఆగస్టు 2020
Sangareddy - May 28, 2020 , 23:59:46

వలసలకు స్వస్తి..

వలసలకు స్వస్తి..

ఝరాసంగం : వలసలకు స్వస్తి పలుకుతూ సొంత గ్రామంలోనే ఉపాధి పనులు కల్పిస్తున్నామని ఏపీవో రాజ్‌కుమార్‌ అన్నారు. గురువారం మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు గంగాపూర్‌, కక్కర్‌వాడ, ఇస్లాంపూర్‌, వనంపల్లి, చిలేమామిడి, జీర్లపల్లి, కుప్పానగర్‌, బర్దీపూర్‌, కమాల్‌పల్లి, మాచూనూర్‌ తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీవో మాట్లాడుతూ కూలీలు ఇతర గ్రామాలకు వలస వెళ్లకుండా సొంత గ్రామంలోనే పనులు కల్పిస్తున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఊరూరా ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో టీఏలు మల్లప్ప, తుక్కరామ్‌, పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు. 


logo