శనివారం 24 అక్టోబర్ 2020
Sangareddy - May 28, 2020 , 00:33:53

ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి

మనోహరాబాద్‌: ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి అన్నారు. శివ్వంపేట మండలం సికింద్లాపూర్‌లో ఎల్లమ్మ, పోచమ్మ దేవాలయాలకు బుధవారం భూమిపూజ చేసి గౌరారం, నవాబ్‌పేట, సికింద్లాపూర్‌ గ్రామాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నిర్మాణదశలో ఉన్న డబుల్‌బెడ్‌ రూం ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి, బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్‌ ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బా మహేశ్‌గుప్తా, సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహిపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, జెడ్పీ కోఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, సర్పంచ్‌ సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

పూడికతీతతో భూగర్భ జలాలు పెరుగుతాయి

నర్సాపూర్‌ రూరల్‌: చెరువులోని పూడికతీతతో భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతుందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్‌ మండల కేంద్రంలో గల రాయారావు చెరువులో చేపడుతున్న పూడికతీత పనులను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కలెక్టర్‌ ధర్మారెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ పూడికతీత తీస్తే పంట సాగుకు పుష్కలంగా నీరు వస్తుందని వెల్లడించారు. కార్యక్రమంలో  మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాద్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ చంద్రాగౌడ్‌, తహసిల్దార్‌ మాలతీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభం 

కౌడిపల్లి : మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి రూ.65 లక్షల నిధులతో బుధవారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు లేకుండా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చిలుముల వెంకటేశ్వర్‌ రెడ్డి, ఎంపీపీ రాజునాయక్‌, జెడ్పీటీసీ కవిత, ఉమ్మడి డీసీబీ డైరెక్టర్‌ గోవర్దన్‌రెడ్డి, మహ్మద్‌నగర్‌ సొసైటీ వైస్‌ చైర్మన్‌ చిన్నంరెడ్డి, ఎంపీటీసీ మంజుల శివాంజనేయులు, తహసీల్దార్‌ రాణాప్రతాప్‌, ఎంపీడీవో కోటిలింగం, వైస్‌ ఎంపీపీ నవీన్‌గుప్తా పాల్గొన్నారు.logo